విజయోత్సవ ర్యా'లీలలు'

తెలంగాణలో రాజకీయ పార్టీల నాయకులు ఎవరికి వారే విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్సే నంటూ వారు సభలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు దానికి తగ్గట్టుగానే సంబురాలు చేసుకోవడంలో తలమునకలయ్యారు. ఈ తంతులో టీడీపీ పరిస్థితే ఎటూ కాకుండా పోయింది. వారు కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహిద్ధామని అనుకుంటే... తెలంగాణ టీడీపీ నేతలకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిందంటూ విజయోత్సవ ర్యాలీ చేసే అర్హత లేదని ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య ఎద్దేవా చేశారు.  రాష్ట్రాన్ని విభజించవద్దంటూ టీడీపీ కేంద్రానికి లేఖ ఇచ్చిందని.... ఆతర్వాత తెలంగాణ ఏర్పాటు సహకరించని వారు విజయోత్సవ ర్యాలీలు ఎలా చేసుకుంటారని వారు నిలదీస్తున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment