21 లేదా 22న వీఆర్వో, వీఏఓ పరీక్ష ఫలితాలు

ఇటీవల జరిగిన వీఆర్వో రాత పరీక్షకు సుమారు 14 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ నెల రెండో తేదీన పరీక్ష నిర్వహించారు. వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల 21 లేదా 22న వెల్లడించబోతున్నారు. ఇప్పటివరకు పది జిల్లాల ఫలితాలు సిద్ధమయ్యాయి. ఇతర జిల్లాల ఫలితాలు సిద్ధమౌతున్నాయి. ఒకవేళ..సమయం మించిపోతున్నట్లయితే... ఫలితాల వెల్లడికి సిద్ధంగా ఉన్న జిల్లాల వరకు ముందుగా తెలియచేసే అవకాశాలు ఉన్నాయి. ఆయా జిల్లాల ప్రతినిధులను పిలిపించి వారికి ఏపీపీఎస్సీ అధికారులు సీడీ అందచేసే అవకాశాలు ఉన్నాయి. గ్రూపు-4 ఉద్యోగాల భర్తీ విషయంలో ఇదే విధానాన్ని అనుసరించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment