Video Of Day

Breaking News

వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్!

పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. పార్లమెంటు సంప్రదాయాలను పక్కనబెట్టి నియంతలా పదే సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 17 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసి ఫ్లోర్‌ను ఖాళీ చేసి... సభలో మాట్లాడే వారు ఎవరూ లేని పరిస్థితుల్లో ఇవాళ పార్లమెంటుకు బిల్లు తెచ్చి నియంతలా బిల్లును ఆమోదించారని విమర్శించారు. పాకిస్థాన్‌లో కూడా ఇలా ఎవరూ చేయరేమోనని వ్యాఖ్యానించారు. విభజనకు సోనియా, చంద్రబాబు, బీజేపీలే కారణమని ఆరోపించారు. బాబు పార్టీకి చెందిన ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్‌లు విభజనకు అనుకూలంగా ఓటేశారన్నారునియంత పోకడకు నిరసనగా రాష్ట్రంలో బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. 

No comments