గాలింపు చర్యల్లో 25 దేశాలు!

25-countries-searching-for-malasia-airplane

గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఆచూకీ ఇంతవరకు లభించలేదు. భారత్‌తో సహా 11 దేశాల భూభాగాలు, సముద్ర జలాల్లో గాలింపు ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు. దాదాపు 25 దేశాలు  గాలింపు తదితర సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. మలేషియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్‌370 విమానం మార్చి 8న గల్లంతైన విషయం తెలిసిందే. అత్యాధునిక రాడార్లు, ఇతర పరికరాలున్నా ఇప్పటిదాకా గుర్తించలేకపోయారు. విమానం ట్రాన్స్‌పాండర్‌ను స్విచాఫ్‌ చేసి ఉద్దేశపూర్వకంగానే దారిమళ్లించారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. హైజాక్‌, కుట్ర, ఉగ్రవాదం కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు 9/11 తరహాలో భారత్ పై దాడికి ప్రయత్రించారని అమెరికా నిపుణులు ట్వీట్లు చేశారు. అయితే వీటిని భారత వైమానికదళ నిపుణులు  ఖండించారు. భారత్‌లో బహుళ అంచెల రాడార్‌ శ్రేణి ఉందనీ, అటువంటి దుశ్చర్యకు పాల్పడాలనుకుంటే విమాన సమాచారం తెలిసేదని వారు పేర్కొన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment