Video Of Day

Breaking News

బుల్లి తారల రాజకీయ తళుకులు!


ఈ సారి రాజకీయ సమరం కాసింత కలర్ ఫుల్ గా మారనున్నట్లుంది. ప్రముఖ తారలు రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తుండడమే దీనికి కారణం. మొన్నటికి మొన్న కలర్స్ స్వాతి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తన ఆశను వెలిబుచ్చింది. ఇప్పుడు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి ఉదయభాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి ఆమె పాలిటిక్స్ లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈమెకు బుల్లితెర వ్యాఖ్యాతగా, నటిగా మంచి క్రేజ్ ఉంది. పాలిటిక్స్ లో అడుగుపెట్టేందుకు ఆమె పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే ఆమె ఏ పార్టీలో చేరతారనేది మాత్రం తెలియలేదు. 

No comments