విమర్శలే వజ్రాయుధాలు!

Politicians Alligations

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. రాజకీయ రణంలో రాణించాలంటే ముందుగా వాటినే మన నేతలు వజ్రాయుధాలుగా వాడుకుంటారు. ఎదుటివారిని చీల్చి చెండాడడానికి వినియోగించుకుంటారు. దేశంలో అధికార, ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు తమ విమర్శలకు పదును పెడుతుంటాయి. ఒక్కోసారి ఈ విమర్శలు పరిధిని కూడా దాటుతున్న సందర్భాలూ లేకపోలేదు. మొదట రాజకీయ ఆరోపణలతో మొదలయ్యే ఈ విమర్శలు, తర్వాత అవినీతి ఆరోపణలకు దారితీస్తాయి. సదరు నాయకులు అవినీతికి పాల్పడ్డారంటూ ఒకరిమీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటుంటారు. వ్యక్తిగత జీవితాలనూ బజారుకు ఈడుస్తారు. తాజాగా బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇప్పటి వరకు రాజకీయ దాడి చేసిన దిగ్విజయ్ .. ‘నీ భార్య  పేరును ఎందుకు దాస్తున్నారు’ అంటూ మోడీని పశ్నించారు. మోడీ భార్య పేరు యశోదా బెన్ అని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఆమె ఇప్పుడు సాధారణ మహిళగా తన జీవితాన్నిఅద్దె ఇంటిలోని సాగిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆమెకు కనీసం బంగ్లాలో ఉండేందుకు ఏర్పాట్లు ఎందుకు చేయలేదని నిలదీశారు. అంతేకాకుండా మహిళలంటే కనీస గౌరవం కూడా మోడీకి లేదని తేల్చేశారు. ఇదంతా దేశంలోని మహిళా ఓటర్లను ప్రభావితం చేయడానికే ఇటువంటి ఆరోపణలూ చేస్తారనీ ఎదురుదాడి చేసేవారూ ఉన్నారు. ఏదేమైనా ఈ విషయంలో మోడీ నోరు విప్పి, దేశ ప్రజలకు సమాధానమిస్తాడో? లేదో చూడాలి!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment