అంగన్‌వాడీలకు నెలకు రూ.800

అంగన్‌వాడీల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంతో శనివారం జరిపిన చర్చలు సఫలమవడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు గత నెల 17 నుంచి చేస్తున్న సమ్మెను విరమించారు. సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ అనుబంధ అంగన్‌వాడీ కార్మికులు, సహాయకురాళ్ల సంఘ నాయకులు సాయిబాబు, రోజా, జయలక్ష్మి తది తరులు సచివాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ ముఖ్యకార్యదర్శి నీలం సహాని, కమిషనర్‌ చిరంజీవి చౌదరి తదితర అధికారులతో చర్చలు జరిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్లకు నెలకు రూ.800 చొప్పున వేతనాలు పెంచేందుకు నీలం సహాని సుముఖత వ్యక్తం చేశారు. ఇతర డిమాండ్లనూ పరిశీలిస్తామని చెప్పారు. స్రీ,్త శిశు సంక్షేమ శాఖ పరిధిలోని హామీలను సత్వరమే నెరవేర్చాలని తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ సంఘం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.రవికుమార్‌ అధికారులను కోరారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment