చిక్కుల్లో ప్రధాన పార్టీలు!

తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ముద్రపడిన కాంగ్రెస్‌, టీడీపీల రాజకీయ ఆధిపత్యం తగ్గుతోంది. సంపూర్ణ మెజార్టీ సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయి నుంచి మద్దతు కోసం చిన్న పార్టీలకు చేయి చాచాల్సి వస్తోంది. గతంలో ఈ పార్టీలు ఇచ్చిన సీట్లు తీసుకొని మిత్రపక్షాలుగా ఉండిపోయే చిన్న పార్టీలు... సర్దుకుపోయే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరుకుంటున్నాయి. కోరినన్ని సీట్లు ఇవ్వాలని పట్టుబట్టుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాల్లో హంగ్‌ ముప్పు పొంచివున్న సంగతి తెలిసిందే. దాంతో పెద్ద పార్టీలకు పొత్తులు తప్పనిసరి అయ్యాయి. అదే అదనుగా చూసిన వామపక్షాలు, టీడీపీ తదితర చిన్న పార్టీలు బెట్టు చేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో డిమాండ్ చేస్తున్నాయి. వీటికి కోరినన్ని సీట్లు ఇవ్వలేక, మద్ధతు కోరకుండా ఉండలేక పెద్ద పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి!!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment