Video Of Day

Breaking News

సచివాలయం ఖాళీ!

ap secretatiet
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నేపథ్యంలో అన్ని కార్యాలకు కేంద్ర స్థానమైన రాష్ట్ర సచివాలయం బోసి పోయింది. సచివాలయంలోని మంత్రుల పేషీలు ఒక్కొక్కటీ ఖాళీ అవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నానికి సాధారణ పరిపాలన శాఖ ఇచ్చిన గడువు ముగియనుండడంతో ఇప్పటికే దాదాపు అందరు మంత్రుల పేషీలు ఖాళీ అయ్యాయి. మిగిలిన ఒకరిద్దరు కూడా ఈరోజు ఖాళీ చేస్తున్నారు. పేషీల్లో ఉన్న ఫర్నిచర్‌, ఫైళ్లు, కంప్యూటర్లు తదితరాల వివరాలను సాధారణ పరిపాలన శాఖకు అప్పచెబుతున్నారు. పేషీల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి మాతృ సంస్థలకు వెళ్లి రిపోర్టు చేశారు. మంత్రుల పేషీలన్నింటికి సాధారణ పరిపాలన శాఖ సీల్‌ చేసింది.

No comments