టీఆర్‌ఎస్‌లోకి బాబూమోహన్?

టీడీపీ నేత, ప్రముఖ నటుడు పి. బాబూమోహన్ టీఆర్ఎస్లో చేరేందుకు ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఒక్క ఫోన్‌ చేసి పిలిస్తే చాలు ఆ పార్టీలో చేరతాను అంటున్నారు. తనను ఎమ్మెల్యే చేసింది కేసీఆరేనని, తనపై ఆయనకు సర్వహక్కులు ఉన్నట్లు తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన బాబూమోహన్ సినిమా రంగం నుంచి నేరుగా అందోల్ నియోజకవర్గానికి వచ్చారు. ఇక్కడ స్థానికేతరుడు అయినప్పటికీ అప్పట్లో సినీగ్లామర్, కేసీఆర్ అండదండలతో టీడీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక పర్యాయం కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి వరుసగా రెండుసార్లు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment