హిందూపురం బరిలో బాలకృష్ణ!


తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్న బాలకృష్ణ హిందూపురం నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ అధినాయకత్వం నిర్ణయించినప్పటికీ ఈ విషయంపై బాలకృష్ణ అభిప్రాయం తేలాల్సి ఉంది. పార్టీ ఇప్పటివరకు నిర్ణయించిన వరకు కుప్పం నుంచే చంద్రబాబు, తాడిపత్రి సీటు జేసీ బ్రదర్స్‌కే నని తెలుస్తోంది. వీటితోపాటు సీమాంధ్రలోని 175 స్థానాల్లో సుమారు 126 స్థానాల అభ్యర్థులపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. అనధికారికంగా ఖరారు చేసిన అభ్యర్థిత్వాలను ఐవీఆర్ఎస్ విధానం ద్వారా జరిపే ప్రజాభిప్రాయ సేకరణతో సరిపోల్చుకుంటుంది. ఐవీఆర్ఎస్‌లో కూడా ఇవే పేర్లపై సానుకూలత వ్యక్తం కావచ్చని పార్టీ భావిస్తోంది. పార్టీ అధికారిక జాబితాలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశముంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment