Video Of Day

Breaking News

లెజెండ్ రివ్యూ.. బాలయ్య తొక్కిపడేశాడు..

lezend review

లెజెండ్ ప్లస్ పాయింట్స్..
బాలయ్య నటన, గెటప్..
జగపతిబాబు క్యారెక్టరైజేషన్..
టైటిల్ సాంగ్..
బీజీఎమ్..
డైలాగ్స్
ఎమోషనల్ సీన్స్
ప్రొడక్షన్ వాల్యూస్..
ఇంటర్వెల్ బ్యాంగ్..
ఫైట్స్..

మైనస్ పాయింట్స్.
కామెడీ పెద్దగా లేకపోవడం
నిడివి(2.40 గంటలు)

విజన్ ఆంధ్రా రేటింగ్- 3.75/5

నందమూరి బాలకృష్ణ  కథానాయకుడిగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించిన సినిమా లెజెండ్. 14  రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహీ చలనచిత్రం సంయుక్తంగా నిర్మంచిన ఈ చిత్రంపై అటు ఇండస్ట్రీలోనూ, అటు అభిమానుల్లోనూ బోలెడు అంచనాలున్నాయి. మరి ఈ లెజెండ్ ఆ అంచనాలను అందుకున్నాడా?

కథేంటి
జితేంద్ర(జగపతిబాబు) కర్నూలు వాసి. పెళ్లిచూపుల కోసం విశాఖపట్నం వస్తాడు. అక్కడ ఓ గొడవలో ఇరుక్కోవడంతో ఆ ఊరి పెద్ద(సుమన్) జితేంద్రను జైలులో పెట్టిస్తాడు. దీంతో జితేంద్ర తండ్రి సుమన్ భార్య(సుహాసిని), కొడుకు జైదేవ్( బాలకృష్ణ) కిడ్నాప్ చేయిస్తాడు. అక్కడి గొడవలో సుహాసిని చనిపోతుంది. జైదేవ్ జితేంద్ర తండ్రిని చంపేస్తాడు. దీంతో జైదేవ్ ను గొడవలను దూరంగా లండన్ పంపిస్తారు. తండ్రి చావుతో పగ పెంచుకున్నజితేంద్ర సుమన్ ను చంపేస్తాడు. వైజాగ్ లో సెటిలై సీఎం కావాలనే కోరికతో ఉంటాడు. ఫారిన్ నుంచి వచ్చిన జైదేవ్ జితేంద్రకు అడుగడుగునా అడ్డుతగులుతాడు. ఈ క్రమంలో అతను కుటుంబానికి దూరమవుతాడు. ప్రేమించిన మరదలిని(రాథికాఆప్టే) కోల్పోతాడు. ఆఖరికి కుటుంబం కోసం ఊరు వదిలి వెళ్లిపోతాడు. కుటుంబం కష్టాల్లో ఉన్న ఓ సమయంలో ఆ పాత్ర అనూహ్యంగా తెరపైకి వచ్చి.. జితేంద్రను అంతం చేస్తుంది. జైదేవ్ జితేంద్రను ఎలా అడ్డుకునాడనేది ప్రథాన కథ. అదే కుటుంబానికి చెందిన కృష్ణ(ఈ పాత్ర కూడా బాలకృష్ణ చేశారు)ది మరో ఉపకథ.

కళాకారుల పనితీరు..
సరైన పాత్ర పడితే బాలకృష్ణ నటన ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే లెజెండ్ చూడాల్సిందే. కొత్త గెటప్, బాడీ లాంగ్వేజ్ తో బాలయ్య లెజెండ్ పాత్రకు ప్రాణం పోశాడు. కొన్ని ఎమోషన్ సన్నివేశాల్లో ఉగ్రతాండవం చేశాడు. ముఖ్యంగా తనకు మాత్రమే సాధ్యమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. యువహీరోలతో పోటీ పడి డ్యాన్స్ చేశాడు. కృష్ణ పాత్రలోనూ మెప్పించాడు. ఈ పాత్ర కోసం బాలయ్య దాదాపు ఎనిమిది కేజీల బరువు తగ్గాడని వినికిడి. ఆ కష్టం తెరమీద కనిపిస్తుంది. ఇక జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ కు ఈ సినిమా మంచి పునాది. జితేంద్ర పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. సొనాలి చౌహాన్, రాథికా ఆప్టేలకు మంచి పాత్రలే దక్కాయి. బ్రహ్మానందం కాసేపు నవ్విస్తాడు. ఇక సితార, కళ్యాణి, ఎల్బీ శ్రీరాం, బ్రహ్మాజీలు చిన్నచిన్నపాత్రల్లో నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు..
దర్శకుడు బోయపాటి శ్రీనుకి కథ, కథనంపై పూర్తి క్లారిటీ ఉండటంతో సాంకేతిక నిపుణుల నుంచి మంచి ఔట్ పుట్ తీసుకున్నాడు. ఫైట్స్ తో పాటు ఎమోషనల్ సీన్లను అద్భుతంగా పండించారు. హీరో ఇజమ్ ను ఎలివేట్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ టేకింగ్ అద్భుతం. రత్నం పంచ్ లు థియేటర్లో విజిల్స్ వేయించాయి. డైలాగ్సే ఈ సినిమాకు ప్రథాన బలం. రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది. రామ్ లక్ష్మణ్ లు వంద శాతం న్యాయం చేశారు. హింస ఎక్కువగానే ఉన్న.. దాన్ని కథ పూర్తిగా సపోర్ట్ చేసింది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం గురించి. ఈ సినిమాకు ఇతను రెండో హీరో. టైటిల్ సాంగ్ మినహా పాటలు సోసోగానే అనిపించినా.. రీరికార్డింగ్ అద్భుతంగా చేశాడు. కొన్ని సన్నివేశాల్లో శరీరం రోమాంఛితం అవుతుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రొడ్యూసర్లు ఎక్కడా రాజీపడకుండా ఖర్చు చేశారు. ప్రతి రూపాయి తెరమీద కనిపిస్తుంది.

చివరిగా...
సూపర్ హిట్ సినిమా సింహ కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ పూర్తిగా హైఓల్డేజ్ మాస్ ఎంటర్ టెయినర్. థియేటర్కు వచ్చే వారందరినీ ఆకట్టుకునే ఈ చిత్రం అభిమానులకు అద్భుతంగా తోస్తుంది. రెండు నెలలుగా సరైన హిట్ లేక నీరసించిపోయిన టాలీవుడ్ కు లెజెండ్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను ఎంత మేర ఆదరిస్తారు అనే అంశమే.. ఈ చిత్ర విజయ స్థాయిని డిసైడ్ చేస్తుంది.

No comments