Video Of Day

Breaking News

బాలయ్యబాబు ఎంపీనా? ఎమ్మెల్యేనా?

సార్వత్రిక ఎన్నికల్లో పత్యక్ష పోరుకు బాలయ్య సిద్ధమనే సంకేతాలు వెలువడిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎమ్మెల్యే స్థానంలోనా? ఎంపీ సీటులోనా? అనే అంశాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  పార్టీలో ఎవరితోనూ బాలయ్య మనసులో ఏముందో ఇంకా బయటపెట్టలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని టీడీపీ కొన్ని సీట్లకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఇందులో అనంతపురం జిల్లాలోని హిందూపురం, కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. బాలయ్య పోటీ చేస్తానంటే హిందూపురం లేదా విజయవాడ లోక్‌సభ సీట్లలో ఏదైనా ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. వీటిలో అనంతపురం జిల్లాలోని సీట్లపైనే బాలయ్య చూపు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

No comments