బంగారు లక్ష్మణ్ (74) కన్నుమూత

బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ (74) కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.  2000-2001 మధ్య కాలంలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999-2000 మధ్య కాలంలో ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 1939 మార్చి 17న జన్మించిన బంగారు లక్ష్మణ్ 1996లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు  ఉన్నారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. అతని భార్య సుశీలా లక్ష్మణ్ కూడా 14వ లోక్ సభకు రాజస్థాన్ నుంచి బీజేపీ తరపున ఎంపికయ్యారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment