Video Of Day

Breaking News

భీమవరం బుల్లోడు రివ్యూ

తారాగణం:
సునీల్‌, ఎస్తేర్‌, పోసాని కృష్ణమురళి, పృధ్వీరాజ్‌, సుప్రీత్‌, జయప్రకాష్‌రెడ్డి, సాయాజీ షిండే, విక్రమ్‌జిత్‌ విర్క్‌, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, సన, శివపార్వతి తదితరులు.
కథ: కాళిదాస్‌,
మాటలు: శ్రీధర్‌ సీపాన,
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌,
ఛాయాగ్రహణం: సంతోష్‌రాయ్‌,
నిర్మాత: సురేష్‌బాబు,
కథనం, దర్శకత్వం: ఉదయ్‌శంకర్‌.
సంస్థ: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి.
విడుదల: 27 ఫిబ్రవరి 2014.
కాస్త కథ, అందులో కొంచెం కామెడీ, మరి కొంచెం లవ్‌, యాక్షన్‌ కలిపితే చాలు రెండున్నర గంటల సినిమా రెడీ అయిపోతుందని భావిస్తున్న రోజులివి. అయితే అన్నింటికన్నా కొత్తదనం అన్నదే అసలు సిసలైన దినుసు అన్న సంగతి మరిచిపోతున్నారు. దర్శకుడు ఉదయ్‌ శంకర్‌ సునీల్‌ కథానాయకుడిగా రూపొందించిన సినిమా భీమవరం బుల్లోడు ఓ ఇంకెందుకు బతకడం అని, ఆత్మహత్య చేసుకుందామనుకుంటే, ఓ పెద్దమనిషి (తనికెళ్ల) కాపాడి, నలుగురికి మేలుచేసి, చచ్చిపో అని గీతోపదేశం చేస్తాడు. దాంతో పట్నం వచ్చి, అక్కడ రౌడీ అన్నవాడిని లేకుండా చేస్తానని ప్రతిన పూనేస్తాడు. రెచ్చిపోయి, రౌడీలందరినీ బాదేస్తుంటాడు. ఈ బాదుడును తన ఖాతాలో వేసుకుని ప్రమోషన్లు కొడుతుంటాడు ఎస్‌ఐ (పోసాని). ఈ నేపథ్యంలోనే నందిని (ఎస్తేర్‌) అనే అమ్మాయిని రౌడీల బారినుంచి కాపాడి, ఆమె ప్రేమలో పడతాడు. ఆమె ఓ సినిమా డైరక్టర్‌ (సాయాజీ షిండే) కూతురు. తన జబ్బు సంగతి తెలుసు కాబట్టి, ప్రేమను దాటి పెళ్లి దాకా వెళ్లడు రాంబాబు. కానీ అంతలోనే రిపోర్టు తారుమారు వ్యవహారం తెలుస్తుంది. సరే పెళ్లి చేసుకుందాం అనుకుంటే, నందినికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. దాంతో బుల్లోడు ఏం చేసాడు... బుల్లెమ్మను పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ. సినిమా కథ వినగానే ఇటీవల వచ్చిన తడాఖా సినిమా ముందుగా గుర్తుకు వచ్చేస్తుంది. అలాగే ఓ కామెడీ ట్రాక్‌ బాపుగారి పెళ్లికొడుకు (బంగారు పిచ్చుక రీమేక్‌) సినిమాను తలపిస్తుంది. ఇక సినిమా ట్రీట్‌మెంట్‌ అంతా ఎనభైల నాటి వ్యవహారంలా అనిపిస్తుంది. సునీల్‌ సినిమా చూస్తున్నామా, రాజేంద్రప్రసాద్‌ కాలం నాటి చిత్రం వీక్షిస్తున్నామా అని సందేహం కలుగుతుంది. పోనీ క్లయిమాక్స్‌ చూస్తే ఈవీవీ తీసేసి, జనం మీదకు వదిలేసిన సినిమాల శైలి గుర్తుకు వస్తుంది. అయితే అదృష్టమేమిటంటే రచయిత సీపాన శ్రీధర్‌ ప్రాసలతో కుస్తీపట్టి, జనాన్ని కొంచెమయినా నవ్వించే ప్రయత్నం చేసి విజయం సాధించడమే. చాలా డైలాగులు బి, సి సెంటర్‌ జనాన్ని హుషారుచేస్తాయి. అవి చాలు ఆ సెంటర్లలో జనం సినిమాను కాస్తయినా ఆదరించడానికి. సంగీత దర్శకుడు అనూప్‌ వినిపించిన ట్యూన్‌లు కూడా మామూలుగానే ఉన్నాయి. ఛాయాగ్రహణం కూడా అలాంటిదే.ఇలాంటి సినిమాను సునీల్‌ తన భుజాలపై మోయాల్సినంతా మోసాడు. తనకు అలవాటైపోయిన డల్‌ఫేస్‌, పెట్టుకుని అదే ఫీల్‌తో రెండున్నర గంటలు సాగించేసాడు. అయితే ఆ మధ్య పెద్ద హీరోలకు పోటీ అన్నట్లుగా భారీగా చేసిన ఫైట్లు, డ్యాన్సులను సగానికి పైగానే తగ్గించేసాడు. హీరోయిన్‌ ఎస్తేర్‌, తన పాటలు, తమ సీన్లు తనవి అన్నట్లు అలా అలా చేసేసి వెళ్లిపోయింది. థర్టీ ఇయర్స్‌ పృధ్వీ మాత్రం తన డైలాగ్‌ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతగాడి ట్రాక్‌ సినిమాకు ప్లస్సయింది. ఇక సాయాజీ షిండే వగైరా మామూలే. మొత్తంమీద భీమవరం బుల్లోడు సినిమా నటుడు సునీల్‌కు ఓ సాదాసీదా సినిమాగా మిగిలినా, జనానికి కాస్త కాలక్షేపంగా కనిపిస్తుంది.తారాగణం: రాజా గౌతమ్‌, అలీషా బేగ్‌, సాయాజీ షిండే, తనికెళ్ళ భరణి, రణధీర్‌ తదితరులుసాంకేతికవర్గంమాటలు: శ్రీకాంత్‌ విస్సా, సంగీతం: మణిశర్మ, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఛాయాగ్రహణం: అనిల్‌ బండారి, పి.కె.వర్మ, కథ, కథనం, నిర్మాత, దర్శకత్వం: చైతన్య దంతులూరిసంస్థ: స్టార్ట్‌ కెమెరా పిక్చర్స్‌, విడుదల: 28 ఫిబ్రవరి 2014.ర్రరిజానికి భారతదేశం ఎంత లోకువైపోయిందో అన్న సంగతి పక్కన పెడితే, సినిమా వాళ్లకు మాత్రం అది అందివచ్చిన విషయం అయిపోయింది. టెర్రరిజం గురించి కనీస పరిశోధన కూడా చేయకుండానే రీళ్లు చుట్టేయడం రివాజైపోయింది. నిజానికి తెలుగు తెరపై రోజా, ముంబాయి, మనోహరం, గగనం వంటి మంచి సినిమాలు టెర్రరిజం నేపథ్యంలో వచ్చాయి. అయితే ఈసారి ఇటు టెర్రరిజాన్ని, అటు ప్రేమను, మరోపక్క యాక్షన్‌ థ్రిల్లర్‌ను కలగలిపి ఓ కొత్త సినిమా అందించాలనుకున్నాడు దర్శకుడు చైతన్య దంతులూరి. కానీ ఏ విషయాన్ని పూర్తి సంతృప్తికరంగా అందించలేకపోయాడు. నటుడు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్‌ హీరోగా నటించిన సినిమా బసంతి సంగతే ఇదంతా. విడుదలకు ముందు వైవిధ్యమైన ప్రచారంతో జనాన్ని ఆకట్టుకున్న ఈ సినిమా, విడుదలైన తరువాత అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.బసంతి కాలేజీ స్టూడెంట్‌ అర్జున్‌ (రాజా గౌతమ్‌). సరదాగా ఫ్రెండ్స్‌తో తిరగేయడం, నచ్చిన వాటిలో తొంభై మార్కులు, నచ్చని వాటిలో సున్నా మార్కులు తెచ్చుకోవడం తప్ప, జీవితంలో ఏం కావాలన్న విషయంపై మాత్రం స్పష్టత ఉండదు. అలాంటి వాడికి స్నేహితుడి చెల్లెలి పెళ్లిలో రోషిణి (అలీషా) తారసపడుతుంది. తొలిసారి చూడగానే ప్రేమించేస్తాడు. ఇంతలో రోషిణి పైచదువుల కోసం లండన్‌ వెళ్లాలని నిర్ణయించుకొంటుంది. తాను ప్రేమిస్తున్న విషయాన్ని రోషిణికి చెప్పాలనుకొని ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరతాడు. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న కరుడు కట్టిన ఉగ్రవాదిని విడిపించుకునేందుకు కొందరు తీవ్రవాదులు ప్రయత్నిస్తారు. వారి ఆచూకి కనిపెట్టి పోలీసులు దాడి చేయడంతో పరారై బసంతి కాలేజీలోకి ఉగ్రవాదులు చొరబడతారు. ఆ ఉగ్రవాదుల అదుపులో అర్జున్‌ స్నేహితులతోపాటు, రోషిణి కూడా ఉంటుంది. లండన్‌ వెళ్లాలనుకొన్న రోషిణి బసంతి కాలేజీలో ఉగ్రవాదుల చెరలో ఎలా చిక్కుకుంది? అర్జున్‌ తన స్నేహితుల కోసం, ప్రేయసి కోసం ఏం చేశాడు? అన్నది మిగిలిన సినిమా.అర్జున్‌గా నటుడు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్‌ గతంలో కన్నా బాగా చేశాడని చెప్పాలి కానీ, మరీ అద్భుతంగా మాత్రం కాదు. ఇక అలీషాకు రెండే ఎక్స్‌ప్రెషన్లు. అయితే నవ్వు మొహం లేకుంటే ఏడుపు మొహం. హీరో ఫ్రెండ్‌గా రణధీర్‌ బెటర్‌. విలన్‌గా అయ్యంగార్‌ సూట్‌ కాలేదు. తనికెళ్ల, సాయాజీ షిండే మామూలే.సినిమా సాంకేతికంగా మాత్రం చాలా ఉన్నతంగా ఉంది. అనిల్‌ బండారి ఫొటోగ్రఫీ జీవం పోసింది. చాన్నాళ్ల తరువాత మణిశర్మ మంచి ట్యూన్లు ఇవ్వడమే కాదు, నేపథ్య సంగీతం కూడా చాలా బాగా చేశాడు. కొన్ని సన్నివేశాలను మణిశర్మే తన నేపథ్య సంగీతంతో బాగా ఎలివేట్‌ చేశాడు. ఎడిటింగ్‌ మామూలే. శ్రీకాంత్‌ విస్సా రాసుకున్న డైలాగులు అక్కడక్కడ పేలాయి కానీ, అంతగా రాణించలేదు. స్క్రీన్‌ప్లే కూడా సాదాసీదాగా సాగింది. సినిమా ఎత్తుగడ డిఫరెంట్‌గా ఉంటుంది. బాగుంది అనుకుని ఆనందపడుతుంటే, అది కాస్తా తరువాత చప్పగా, సాగుతూ ఉంటుంది. ఇంత హడావుడి చేసిన సినిమా చివరికి హీరోయిజం క్త్లెమాక్స్‌ దిశగా నడుస్తుంది. పైగా సినిమాలో ప్రేమ సన్నివేశాలను పండించలేదు. 

No comments