యూఎస్ లోనూ లెజెండ్ మేనియా..

balayya lezend... vision andhra

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న "లెజెండ్" సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 2010 బ్లాక్ బస్టర్ సింహా కాంబినేషన్, ప్రామిసింగ్ గా ఉన్న ట్రైలర్, దేవిశ్రీ సంగీతాలు కలిసి సినిమా మార్కెట్ ను అమాంతం పెంచాయి. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను కూడా ఓ టీవీ చానల్ రూ.8.50 కోట్లకు కొనుగోలు చేసిందని వినికిడి.
        ఈ నెల 28న విడుదల చేయనున్న సినిమా కోసం బయ్యర్లు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఓవర్సీస్ లోనూ బాలయ్య మేనియా మొదలైంది. అమెరికాలో అత్యధికంగా 90 స్ర్కీన్లలో లెజెండ్ సినిమాను విడుదల చేస్తున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా ప్రకటించారు. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది అత్యధికం. సరైన సినిమాలేక రెండు నెలల నుంచి ఖాళీగా ఉన్న థియేటర్లలో లెజెండ్ సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలంటే 28వ తేదీ వరకు ఆగాల్సిందే.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment