సీబీఐ మాజీ జేడీ పాలిటిక్స్ లోకి వస్తారా?

cbi jd lakshmi narayana


సీబీఐ హైదరాబాద్ విభాగం మాజీ జాయింట్ డెరైక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణకు రాజకీయాల్లోకి వస్తున్నారా? రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నంత కాలం నిజాయతీ కలిగిన ఆఫీసర్ గా పేరుప్రఖ్యతులు పొందారు. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాప్తులో కఠినంగా వ్యవహరించి అధికమొత్తంలో క్రెడిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆయనకు ప్రత్యేకంగా అభిమాన సంఘాలు ఏర్పడడం కూడా గమనార్హం. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలోని థానే నగర జాయింట్ పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావాలని పలు పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీలో చేరేందుకు పిలిచాయని ఆయనే స్వయంగా వెల్లడించారు కూడా.  అయితే మరికొన్నాళ్లు విధులు నిర్వహించాలని నిర్వహించుకున్నట్లు సమాచారం. అందుకోసమే ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు లేదని ప్రకటించారని అంటున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment