పరుగు ఆపిన కళాకారుడు..

sobhan babu soggadu
సినిమా పరిశ్రమ ఓ రంగుల లోకం. అందమైన ప్రపంచం. ఆ రంగంలోకి వెళ్లిన వాళ్లందరూ ఆ వెలుగుజిలుగులకు దాసోహమవుతారు. జీవించి ఉన్నంత వరకు నటిస్తూనే ఉండాలని తపన పడుతుంటారు. శరీరం సహకరించకపోయినా ఎలాగోలా ప్రయాస పడుతూనే ఉంటారు. కానీ శోభన్ బాబు లాంటి కొందరు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. కెరీర్ ఉచ్ఛదశలో ఉన్నప్పుడే ఆయన సినిమా రంగం నుంచి వైదొలిగారు. తర్వాత ఎందరు బలవంతపెట్టినా అటువైపు కన్నెత్తి చూడలేదు. బ్లాంక్ చెక్ లు ఆఫర్ చేసినా మేకప్ వేసుకోలేదు. పరుగు ఆపడం ఓ కళ. ఆ కళను బాగా ఒంటబట్టించుకున్న కళాకారుడు శోభన్ బాబు. ఆ అందగాడి వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి నాలుగు మాటలు.
         నటభూషణ శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి 14, 1937న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. కృష్ణా జిల్లా చిన నందిగామ ఆయన స్వగ్రామం. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు.  ఆయన చిన్ననాటి నుంచే సినిమాలు అధికంగా చూసే వారు. నాటకాలు వేసేవారు. మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. శోభన్ బాబు నటించిన కొన్ని మంచి చిత్రాలు శారద, మనుషులు మారాలి, బలిపీఠం, సోగ్గాడు, చెల్లెలి కాపురం, మహారాజు, ధర్మపీఠం దద్దరిల్లింది తదితరాలు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. 220 పైగా చిత్రాల్లో నటించిన ఈ అందాల నటుడి ఆఖరి చిత్రం 1996లో విడులైన హలో గురూ. శోభన్ బాబు 2008, మార్చి 20 ఉదయం గం.10:50ని.లకు చెన్నై లోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

1 comments:

  1. 1996 tarvatha kooda cinimalu

    ReplyDelete