Video Of Day

Breaking News

కిరణ్ పై చిరు ఫైర్!

Chiru-fire-on-kiran

ఎంత సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకులైనా అంతలోనే మాటలు మారుస్తారు. రాత్రికి రాత్రే పార్టీలు మారుతారు. కొత్త పార్టీలు స్థాపించగలరు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇంతవరకు పల్లెత్తు మాట అనని కేంద్ర మంత్రి చిరంజీవి తన ఆవేశాన్ని విమర్శల రూపంలో వదిలాడు. విభజనకు ముఖ్య కారకుడు కిరణేనని అని నిందించారు. సీఎం పదవి పోతుందన్న భయంతోనే ఆయన విభజనకు కారకుడయ్యారన్నారు. తెలంగాణకు ప్యాకేజీ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గుచూపితే వద్దని అడ్డుపడి ప్రత్యేక రాష్ట్రానికి కారకుడయ్యాడని తెలిపాడు. కిరణ్ ముందుగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుంటే విభజన జరిగేది కాదని సెలవిచ్చారు. పదవులు అనుభవించి పార్టీ వదిలి వెళ్లిపోవడం సమంజసం కాదని సలహా ఇచ్చారు.

No comments