పవన్ చెప్పలేదు, పిలవలేదు : అలీ

pavan, ali, janasena

జనసేన పార్టీ గురించి పవన్ తనకు చెప్పలేదని , రమ్మని అనలేదని పవన్  సన్నిహితుడు,  ప్రముఖ హాస్యనటుడు అలీ అన్నారు. పవన్‌కల్యాణ్‌కి అత్యంత ఆప్తుడైనంత మాత్రాన ఆయన ప్రతి విషయాన్ని తనకు చెప్పాలని లేదని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి తనను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని అడుగుతున్నారని, అయితే సొంత ప్రాంతమైన రాజమండ్రి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని చెప్పరు. ఏ పార్టీ నుంచి అని ప్రశ్నిస్తే ‘కాట్రవల్లి పార్టీ’ అంటూ చమత్కరించారు. స్థానిక గైట్ కళాశాలలో మైత్రి యువజనోత్సవాలలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సినిమాల పరంగా పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment