నగ్మాను నడి రోడ్డుపై ముద్దెట్టుకున్నాడు..

nagma

సినీ నటి నగ్మాను ఓ  కాంగ్రెస్స్ ఎమ్మెల్యే బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నియోజకవర్గంలో నామినేషన్  కార్యక్రమానికి హాజరైన నగ్మాతో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ శర్మ అనుచితంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థని తెలిసి కూడా పబ్లిక్ గా నగ్మాను గిరిరాజ్ శర్మ ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే శర్మ తీరుతో నగ్మాతోపాటు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు షాక్ కి  గురయ్యారు. ఎమ్మెల్యే గిరిరాజ్ శర్మపై స్థానికులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరట్ లో నగ్మా నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున్న అభిమానుల, కార్యకర్తలు హాజరయ్యారు. నగ్మాను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. వీరిని అదుపు చేయలేక పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment