నారాయణకు టైమొచ్చింది..

cpi narayana trs

మిగతా సందర్భాల్లో ఎలా ఉన్న ఎన్నికల వేళ మాత్రం ఉభయ కమ్యునిష్టు పార్టీల పొత్తు కోసం మిగతా పార్టీల నాయకులు అర్రులు చాస్తుంటారు. పరిమితంగానే ఉన్నా.. పటిష్ఠమైన క్యాడర్ ఈ పార్టీల ప్రధాన బలం. ఈ సారి ఎన్నికల్లో బహుముఖ పోటీ ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటూ విలువైందే. ముఖ్యంగా సీపీఐకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒకటిన్నర శాతం ఓట్లున్నాయి. దీంతో తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ లు స్నేహహస్తం చాస్తున్నాయి. ఆదివారం రెండు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీఆర్ఎస్ నేతలు కేకే, వినోద్ లు నారాయణతో చర్చించారు. ఈ సంద్భంగా నారాయణ టీఆర్ఎస్ అధినేత అహంకారపూరిత వైఖరిపై గుస్సా అయినట్లు సమాచారం. ఏదిఏమైనా పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తున్నా.. ఆర్ఎస్ తోనే సీపీఐ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment