పవన్ అంటే ఇష్టమే కానీ..:బన్నీ

తనకు పవన్ అంటే ఇష్టం, కానీ చిరంజీవి అంటే ప్రాణం అని  సినీహీరో అల్లు అర్జున్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్దాపించిన జనసేన పార్టీపై స్పందించేందుకు ఆయన నిరాకరించాడు. తనకు తానే పోటీ తప్ప ఎవరూ పోటీకాదని స్పష్టం చేశారు. ఎవరి రికార్డులు బ్రేక్ చేయాలన్నది తన ఆలోచన కాదని, రికార్డులను తానే అధిగమిస్తానన్నారు. స్థానిక గైట్ కళాశాల క్యాంపస్‌లో నిర్వహిస్తున్న మైత్రి యువజనోత్సవాల్లో 'రేసుగుర్రం' సినిమా యూనిట్ తో కలిసి అల్లు అర్జున్ పాల్గొన్నారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సురేంద్రరెడ్డి, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్‌ల సమక్షంలో హాస్యనటుడు అలీ  'రేసుగుర్రం' ట్రైలర్‌ను ఆవిష్కరించారు. 

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment