అందుకే కూతుర్ని చంపేశాం..

vision andhra

కుమార్తె ప్రేమను జీర్ణించుకోలేక దారుణంగా హతమార్చిన ఆమె తల్లిదండ్రులు సామ్రాజ్యం, హరిబాబులను పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆవేశంలోనే కూతుర్ని చంపుకున్నామని తల్లిదండ్రులు రోదించారు. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులే హతమార్చారని డీఎస్పీ నాగరాజు తెలిపారు. కాగా రిసెప్షన్ కోసం దీప్తిని ఇంటికి తీసుకు వచ్చామని...  ఆమె తల్లి స్నానానికి వెళ్లినప్పుడు,  కులాంతర వివాహం చేసుకున్నందుకు తాను దీప్తిని తిట్టానని హరిబాబు చెప్పారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో, ఇష్టం లేకపోతే ఎప్పటికీ పుట్టింటికి రానని దీప్తి తెగేసి చెప్పడంతో, కోపంతో ఆమెను కొట్టానని, కణతపై దెబ్బ తగలడంతో చనిపోయిందని వివరించారు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాలనుకున్నానని హరిబాబు అంగీకరించారు.  
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment