Video Of Day

Breaking News

వస్తే రండి.. పోతే పొండి


tdp bjp chandrababu
టీడీపీ, బీజేపీ పొత్తు రసకందాయంలో పడింది. సీమాంధ్రలో నామమాత్రంగా, తెలంగాణలో ఓ మోస్తరుగా క్యాడర్ ఉన్న బీజేపీ అధిక భాగం సీట్లు అడుగుతుండటంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అడిగే సీట్లలో న్యాయం ఉండాలని ఆయన ఆదివారం బాహాటంగానే వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా 45 సీట్లు అడిగిన బీజేపీ.. కేవలం పది మాత్రమే గెలిచిందని ఆయన గుర్తు చేస్తున్నారు. బీజేపీ నేతలు మరోసారి సీట్ల విషయంలో ఒత్తిడి తీసుకొస్తే 'కలిసి వస్తే రండి.. పోతే పొండి' అని సమాధానం చెప్పాలని తెలుగు తముళ్లు అధినేతకు సూచిస్తున్నట్లు సమాచారం. విసిగిపోయిన చంద్రబాబు కూడా దానికే అంగీకారం తెలిపినట్లు తెలిసింది.

No comments