'యాదగిరి' బ్రహ్మోత్సవాలు

Yadagiri gutta

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో 11 రోజుల పాటు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం మొదలయ్యాయి. ఈ ఉత్సవాలకు అదే రోజు రాత్రి అంకురార్పణ నిర్వహిస్తారు. రెండో రోజు ధ్వజారోహణం, మూడో రోజు నుంచి అలంకార వేడుకలకు శ్రీకారం జరుగుతుంది. విశేష పర్వాల్లో ఎదుర్కోలు ఘట్టాన్ని మార్చి 9న, తిరుకల్యాణ మహోత్సవం 10వ తేదీ నాటి రాత్రి నిర్వహిస్తారు. రథోత్సవం 11వ తేదీన, అష్టోత్తర శతఘటాభిషేకంతో మార్చి 13న ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment