చాయ్ పే చర్చకు చిక్కులు!

మూడో విడత చాయ్‌ పే చర్చ కార్యక్రమాన్ని ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నేపథ్యంలో... ఈ కార్యక్రమానికి ఎన్నికల సంఘం నుంచి ఆటంకాలు తప్పేలా లేవు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందువల్ల ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయరాదని నిబంధనలు చెబుతున్నాయి. టీ ఇవ్వడం కూడాఉల్లంఘనే అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉచితంగా టీ పంపిణీ చేయడం నిబంధనావళిని ఉల్లంఘించడమేనంటూ కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమానికి అనుమతి తీసుకున్నప్పటికీ ఉచితంగా టీ ఇవ్వడాన్ని లంచంగా పరిగణించి కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి ఉమేశ్‌ సిన్హా తెలిపారు.  మూడో విడత చాయ్‌ పే చర్చ కార్య్రమంలో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులతో ఇంటర్నెట్‌ సహాయంతో మోడీ నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment