Video Of Day

Breaking News

తెలంగాణ రాదనుకునే దళిత సీఎం ప్రకటన!


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై చంద్రబాబు ఘాటైన విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణ రాదని ఊహించి తెలంగాణకు మొదటి సీఎం దళితుడని ప్రకటించారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వగానే తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చివరకు తెలంగాణ రావడంతో మాటమార్చేశారని విమర్శించారు. అలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తి తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న గోతిలో పడిందన్నారు. తెరాస వసూళ్ల పార్టీ అని విమర్శించారు. సోమవారం నుంచీ తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, ఇక్కడా తెదేపా జెండా ఎగురుతుందన్నారు. సామాజిక, నవతెలంగాణ పునర్‌నిర్మాణం చేసే సత్తా తెదేపాకే ఉందన్నారు. 

No comments