Video Of Day

Breaking News

2009 ఎన్నికల ఫలితాలను టీడీపీ తిప్పికొడుతుందా?

పవన్ కళ్యాణ్ జనసేన చిరు ప్రభావాన్ని ఏ మాత్రం అడ్డుకుంటుంది?
బాబుకు అప్పట్లో ప్రజారాజ్యం, ఇప్పట్లో వైసీపీ, జై సమైక్యాంధ్ర
రెండింటిని కాదు మూడింటిని దాటుకొని బయటపడగలరా?
వలస పక్షులు టీడీపీని బలోపేతం చేస్తారా?
జగన్, కిరణ్ సైకిల్ పార్టీపై ప్రభావం చూపుతారా?

Chandra-babu-naidu-tdp-effect-in-electionsహైదరాబాద్ : 2009 ఎన్నికల్లో చంద్రబాబే సీఎం అవుతాడనుకున్న ఓటర్లు, రాజకీయ మేధావుల లెక్కల అంచనాలను తలకిందులుగా చేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇటు చంద్రబాబును, అటు చిరంజీవి ప్రజారాజ్యాన్ని మట్టి కరిపించారు. వందశాతం చంద్రబాబే సీఎం అవుతాడనుకున్న క్షణంలో ఆఖరి
క్షణంలో ఫలితాలు తారుమారు అయ్యాయి. బాబు ఓడిపోవడానికి సవాలక్ష కారణాలు అన్న చందంగా అప్పుడే పుట్టిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఓట్లు టీడీపీ ఓటు బ్యాంకును చీల్చాయి. అంతేగాక లోక్ సత్తా పార్టీ కూడా అడపో దడపో ఓట్లను చీల్చిందని చెప్పవచ్చు. ఈ విధంగా  త్రిముఖ పోటీలో లోక్ సత్తా, టీఆర్ఎస్, ప్రజారాజ్యాన్ని వెనక్కు నెట్టి వైఎస్ కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో గెలపించారు. చంద్రబాబుకు అలా దెబ్బతీసిన ప్రజారాజ్యం పార్టీ అనంతరం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఒక రకంగా బాబుకు కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. కాకపోతే రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ కొత్తగా వైఎస్సార్ సీపీని పెట్టడం, అంతేగాక కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీలు రెండు చంద్రబాబునే టార్గెట్ గా చేసుకొని ఎన్నికల ప్రచారంలో దిగాయి. సీమాంధ్రలో పరిస్థితి ఇలా ఉంటే. తెలంగాణ రాష్ర్టంలో తెలంగాణ అభివృద్దే ద్యేయంగా తెలంగాణ కోసమే పుట్టిన టీఆర్ ఎస్ కూడా చంద్రబాబుపైనే టార్గెట్ చేయడం ప్రారంభించింది. ఇలాంటి సమయంలో టీడీపీ ఎలా ఎదుర్కొంటుందనేది తెలంగాణ జిల్లాల్లో వేచిచూడాల్సిన పరిస్థితి.
టీడీపీని వలస పక్షులు బలం పెంచుతాయా?
రాష్ర్టాన్ని అన్యాయంగా విభజించిందని కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు టీడీపీలో చేరుతున్నారు. వీరంతా 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడగొట్టిన వారే! ఇప్పుడు వీరంతా టీడీపీలో చేరడం వల్ల బాబుకు ఎంతవరకు లాభం చేకూరుతుందో చూడాలి.
పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ లో చిరు ప్రభావాన్ని ఎదుర్కొంటారా?
జనసేన పేరుతో పార్టీని స్థాపించిన చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ లో ప్రధాన పాత్రను పోషిస్తున్న చిరు ప్రభావాన్ని ఎంతవరకు నిలుపుదల చేసి కాంగ్రెస్ యేతర పార్టీ టీడీపీకి మేలు చేకూర్చుతారా? బీజేపీకి లాభం చేకూర్చుతారా అన్నది వీడని మిస్టరీ.