చిరంజీవిని పట్టించుకోని కాంగ్రెస్ హైకమాండ్!


సీమాంధ్రలో పూర్తిగా కాపు సామాజిక వర్గంపై అందులోనూ చిరంజీవికి ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించినా.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం చిరంజీవిని లైట్ తీసుకున్నట్లుంది! ప్రచార కమిటీ చైర్మన్ గా పదవిని కట్టబెట్టినా ఆయన స్థాయికి ఇది చాలా చిన్న పదవని చిరు  అనుచరులు బాధపడుతున్నారంట! అయితే చిరంజీవిని పట్టించుకోకపోవడానికి కారణం.. చిరు సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టనుండటమే! సోదరుడ్ని రాజకీయాలలోకి రాకుండా అడ్డుకోలేకపోవడంతోపాటు పాత ప్రజారాజ్యం నుంచి గెలిచిన ఎంఎల్ఏలు కాంగ్రెస్ ను వదిలి టీడీపీలో చేరుతున్నా వారిని నిలవరించలేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది! మిగిలిన కాపు సామాజిక వర్గ ప్రధాన నేతలను కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఇంతకుముందు ముఖ్యమంత్రి, పీసీసీ రేసులో ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ, కేంద్ర మంత్రి పల్లం రాజులను కూడా కేవలం ఎన్నికల కమిటీ సభ్యులుగా నియమించింది. బొత్స సత్యనారాయణను కూడా కాంగ్రెస్ హైకమాండే తప్పించిదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment