ఏరు దాటాక బోడి మల్లన్న

damodhar-comments-on-kcr

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పార్టీని విలీనం చేస్తామని, తర్వాత పొత్తు పెట్టుకోవటానికి ప్రత్యేక కమిటీ నియమించామని, తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని, ముస్లింని ఉప ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను ఉద్దేశించి కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనరసింహ విమర్శించారు. ఈ వ్యవహారం ఏరు దాటాక బోడి మల్లన్న అనే నైజంగా ఉందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ చెబుతున్న తెలంగాణ పునర్‌నిర్మాణమంటే.. గడీల నిర్మాణమేనన్నారు. 2004లో 52 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే 26 స్థానాల్లో, 2009లో 52 స్థానాల్లో పోటీ చేస్తే 10 స్థానాల్లోనే గెలిచిందని గుర్తుచేశారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment