Video Of Day

Breaking News

పవన్ - చిరుకు తేడాలేంటి?

Chiru-pawan-differences

పవర్ కింగ్ పవన్ పార్టీ పెట్టనున్న నేపథ్యంలో అనేక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. ఈ పార్టీ అన్న చిరంజీవి పీఆర్పీలాగా పట్ మంటుందా లేదంటే ఘన విజయం సాధిస్తుందా అని విశ్లేషకులు, ఇటు పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ముందు ఇద్దరిలో తేడాలు గమినిస్తే పవన్ లో చేసే పని పట్ల నిబద్దత, అంకితభావం, ప్రాంతాలకతీతంగా సహాయం చేయడం, ముక్కుసూటిగా మాట్లాడటం, కొత్తవాళ్లను ప్రోత్సహించడం వంటి ఎన్నో మంచి లక్షణాలు కనిపిస్తాయి. ఇందుకు ఉదాహరణగా చిన్నచిన్న పాత్రలు వేసే ఒక తెలంగాణా నటి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే తనే డబ్బులిచ్చి వైద్యం చేయించడం, అనంతపురం జిల్లాకు చెందిన వర్ధమాన షూటింగ్ క్రీడాకారిణి కోచింగ్ తీసుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం, ఉత్తరాఖండ్ వరద బాధితులకు అందరికంటే ముందుగా 20 లక్షలు ఇవ్వడం ఇలా ఎన్నో. సినిమా రంగంలోనూ తను చేసిన సినిమాలన్నింటిలో ఒకరిద్దరు తప్పితే (ఇవివి సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య) మినహాయించి అందరూ కొత్త దర్శకులే. ఇప్పుడు అగ్ర దర్శకుడిగా చెలామణి అవుతున్న పూరి జగన్నాథ్ కు లైఫ్ ఇచ్చిందీ పవనే. ఇంకా కరుణాకరన్, అరుణ్ ప్రసాద్, వీరశంకర్ ఇలా ఎంతోమంది కి తనతో పనిచేసే అవకాశం ఇచ్చాడు పవన్. జానీ పరాజయం తర్వాత పంపిణీదారులకు డబ్బులు కూడా తిరిగి ఇచ్చి తన ఉదారతను చాటుకొన్నాడు. అంతేకాకుండా ఆరెంజ్ పరాజయంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అన్న నాగబాబును ఆదుకుందీ పవనే. ఈ విషయాన్నినాగబాబు స్వయంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇక అన్న చిరంజీవి విషయానికొస్తే ఈ లక్షణాలేవీ చిరులో కనిపించవు! బావ అల్లు అరవింద్ మాట దాటడనే అపవాదుతోపాటు కొత్త దర్శకులను ప్రోత్సహించింది చాలా తక్కువ. తను చేసిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు విజయబాపినీడు, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు వంటి దర్శకులతో చేసినవే. అంతేకాకుండా తన మామ అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ప్రారంభానికి పిలిస్తే వెళ్లలేదనీ, తను చదువుకున్న నర్పాపురం డిగ్రీ కాలేజీ యాజమాన్యం కాలేజీ అభివద్ధికి విరాళం అడిగితే ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి! అందువల్లే గత ఎన్నికల్లో ఎక్కువ మంది కాపులు దాదాపు 52 శాతం మంది పీఆర్పీకు ఓటేయలేదు. పాలకొల్లు పరాజయానికి ఇదీ ఒక కారణంగా నిలిచింది. కానీ పవన్ విషయంలో మాత్రం అభిమానులు, సొంత సామాజిక వర్గం తన వెంటే నడిచే అవకాశం ఉంది.No comments