Video Of Day

Breaking News

ఉత్తమ విలన్ లో కమల్ డబుల్ యాక్షన్!


రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉత్తమ విలన్‌' చిత్రంలో మరోసారి రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు కమల్. ఇందులో కమల్‌ 8వ శతాబ్దపు డ్రామా నటుడిగానూ, 21వ శతాబ్దపు సినిమా సూపర్‌స్టార్‌గానూ కనిపించబోతున్నట్టు తెలిసింది. ఇందులో కమల్‌హాసన్‌ గురువు కె.బాలచందర్‌ తండ్రి పాత్రలో, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మామ పాత్రలో నటిస్తున్నారు. ఆండ్రియా, పూజాకుమార్‌ కథానాయికలు. చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కమల్‌హాసనే.

No comments