Video Of Day

Breaking News

డ్రగ్స్ కేసులో వర్ధమాన హీరో!

తెలుగు చిత్ర పరిశ్రమను డ్రగ్స్ రాకెట్ మరోసారి కుదేసే అవకాశాలున్నాయి. గతంలోనూ పలువురు టాలీవుడ్ నటులు మాదక ద్రవ్యాలతో పట్టుబడిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు కూడా పోలీసులకు పట్టుబడిన విషయం సంచలనం సృష్టించింది. తాజాగా  మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టును సౌత్ జోన్ పోలీసులు రట్టు చేశారు. జూబ్లీహిల్స్ లో   వర్థమాన నటుడు ఉదయ్(పరారే, ఫేస్ బుక్ చిత్రాల ఫేమ్) సహా ఓ నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 16 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

No comments