గద్దర్ ను అక్కున చేర్చుకుంది సీమాంధ్రులే!


ప్రజాయుద్ధ నౌక గద్దర్ పై తెలంగాణలో దాడి జరిగినప్పుడు ఆదరించి అక్కున చేర్చుకుంది సీమాంధ్రులే అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కావాలంటే ఈ విషయాన్ని గద్దరన్ననే అడిగి తెలుసుకోవాలన్నారు. మార్చి 14 నోవాటెల్ లో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. తెలంగాణ ఆటను, పాటను అగౌరవపరిచే వ్యక్తిని తాను కాదని, తొమ్మిదో తరగతి చదివేటప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం గురించి చదవానని తెలిపారు. అంతేకానీ కొంతమందిలాగా కొత్తగా ప్రేమొచ్చి చదవలేదని చెప్పారు. నెల్లూరు టౌన్ హాలులో గద్దరన్న గజ్జె కట్టి పాడితే తాను ఉర్రూతలూగి డ్యాన్స్ చేశానని అన్నారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment