ఇష్టారాజ్యంగా 'సోషల్' ప్రచారం కుదరదు!

guidlines-for-political-parties-on-social-media
Guidlines for political parties on social media
ఈ మధ్య అన్ని  రాష్ట్రీయ, జాతీయ పార్టీలు సోషల్ మీడియాను ప్రచారానికి పెద్ద ఎత్తున వాడుకుంటున్నాయి. వాటిల్లో ప్రకటనల నిమిత్తం భారీ మొత్తాలను చెల్లిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వాటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి నియంత్రణ లేకపోవడం గమనార్హం. అయితే తాజాగా ఎన్నికల సంఘం వాటిపై మార్గదర్శకాలను జారీ చేసింది. వెబ్సైట్లలో పెట్టేముందు సంబంధిత ప్రకటనలకు సంబంధించిన ధ్రువీకరణ తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇచ్చే ప్రకటనలపై ఇచ్చే చెల్లింపులను నమోదు చేయాలని సోషల్ మీడియా సైట్లకు రాసిన లేఖల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. అడిగినప్పుడు ఆ వివరాలను ఇవ్వాలని తెలిపింది. చట్టవిరుద్ధంగా, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా ఉన్న ప్రకటలను, వివరాలను సైట్లలో ఉంచొద్దని సూచించింది. సోషల్‌ మీడియాలో ప్రకటనల ఖర్చులను పార్టీలు, అభ్యర్థులు కూడా అడిగినప్పుడు సమర్పించాలని స్పష్టం చేసింది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment