Video Of Day

Breaking News

కిరణ్ కు హర్షకుమార్ హ్యాండిస్తారా?

kirankumar-reddy-harshakumar
ముఖ్యమంత్రి పదవిని వదిలి జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవాలే మిగిలేలా ఉన్నాయి. రాష్ట్ర విభజన పూర్తి స్థాయిలో ఖరారైన తర్వాత కూడా సమైకాంధ్ర నినాదం ఎత్తుకోవడమే కాకుండా అదే పేరుతో పార్టీని స్థాపించడం అందరినీ విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పార్టీ స్థాపిస్తే వెంట నడిచొచ్చే నేతల సంఖ్య అమాంతం పెరుగుతోందని ఆశపడ్డప్పటికీ పూర్తి నిరాశే మిగిలింది. అత్యంత సన్నిహితులుకూడా పార్టీ పెట్టేనాటికి చేయివ్వడం తెలిసిందే.  ఇప్పటికే పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్.. కిరణ్ పార్టీలో  కొనసాగలేనని తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. ఒక దశలో మరో మాజీ మంత్రి పితాని కూడా పార్టీ వీడనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని పితాని ఖండించారు. అయితే తాజాగా కిరణ్ నిర్వహించిన ముఖ్యనేతల సమావేశానికి అమలాపురం ఎమ్.పి హర్షకుమార్ దూరంగా ఉన్నారు. ఇతర పనుల కారణంగా రాలేదా? లేక ఉద్దేశపూర్వకంగానే రాలేది అని వెల్లడించకపోవడంతో పలు  అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

No comments