Video Of Day

Breaking News

ఆ నటి కత్తితో విమానం ఎక్కిందంట!

కనిపించకుండా పోయిన మలేసియా విమానాన్ని హైజాక్ చేసి ఉంటారన్న అనుమానాలు బలపడుతుండగా... మరోపక్క ఓ హాలీవుడ్ నటి కత్తితో విమానం ఎక్కేసి విమానాశ్రయాల్లో భద్రత డొల్లతనాన్ని ప్రపంచానికి చాటింది. నటి అమందా సేఫ్రీడ్ తన బ్యాగులో కత్తి ఉందన్న సంగతి మర్చిపోయి లాస్ ఏంజెలెస్ లో విమానం ఎక్కేసింది. విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది ఆమె బ్యాగులో ఉన్న కత్తిని పసిగట్టలేకపోయారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. అంతేకాదు తన దగ్గర ఉన్న కత్తి ఫోటోను ట్విటర్ లో పెట్టి భద్రతా అధికారుల అలసత్వానికి చురక అంటించింది. ఎవరేం తీసుకెళ్లినా పట్టించుకోరా అంటూ ప్రశ్నించింది. సెక్యురిటీ అధికారుల తీరు పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై భద్రతాధికారులు ఇంకా స్పందించలేదు.

No comments