నేనేమైనా ఆంటీలా ఉన్నానా!


anushka shetty slim

రొమాంటిక్, మోడరన్ తోపాటు చారిత్రక, జానపదాల నేపథ్యాలున్న సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న అగ్ర కథానాయిక అనుష్క.  రొమాంటిక్ సినిమాలతో పాటు కథానాయిక ప్రాధాన్యతా సినిమాల్లోనూ తన సత్తా నిరూపించుకున్న హీరోయిన్ అనుష్క. ప్రస్తుతం బాహుబలి, రుద్రమదేవి వంటి సంచలనాత్మక చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ కాసింత ట్రెండ్ మార్చడానికి ప్రయత్నిస్తోంది. చారిత్రక, జానపద చిత్రాల తరువాత మళ్లీ మోడరన్ దుస్తులలో నటించాలని ఉబలాటపడింది. అందులో  భాగంగానే యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీలను డిఫరెంట్ గా తీయడంలో దిట్ట... ఏం మాయచేశావో. ఎటో వెళ్ళిపోయింది మనసు వంటి సూపర్‌ డూపర్ హిట్‌ సినిమాల దర్శకుడు గౌతం వాసుదేవ  మీనన్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకుంది‌. ఆయన అజిత్ హీరోగా తమిళ సినిమాలో అనుష్కను కాస్త మోడరన్ దుస్తుల్లో నాజూకుగా చూపించాలనుకున్నాడు. అక్కడే చిక్కు వచ్చిపడింది. చిత్ర కథ చెప్పడం కోసం మీనన్ అనుష్కను పిలిపించారు. అనుష్కను చూసిన మీనన్ ఒక్కసారిగా షాక్ అయ్యారట. అనుష్క ఏంటి ఇంత బొద్దుగా ఉందని పక్కనున్న వారితో అన్నారట. అంతే.. ఇంకేముంది... ఈ మాట ఆనోటా ఈ నోటా నాని వెళ్లి... అనుష్క చెవిలో పడింది. దాంతో జేజమ్మ సదరు చిత్రంలో నటిస్తుందో లేదో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment