టీడీపీకి పవన్ మద్దతు ఇస్తాడా?

pawan chandrababu

జన సేన పార్టీని స్థాపించి, జాతీయ పార్టీల నేతలను కలుస్తూ బిజీబిజీగా ఉన్న పవన్ మరో సారి ఆసక్తికర అంశాన్ని లేవనెత్తాడు. ఇప్పటి వరకు రాష్ట్రంలో జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇవ్వనుందని జరుగుతున్న ప్రచారాన్ని పవన్ కొట్టి పారేశాడు. తాను టీడీపీతో సహా ఏ ప్రాంతీయ పార్టీకీ మద్దతు ఇవ్వాలని ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదని స్పష్టం చేశాడు. లేనిపోని పుకార్లు వస్తున్న నేపథ్యంలో నేనీ విషయాన్ని స్పష్టం చేస్తున్నానని బీజేపీ సీమాంధ్ర నాయకుడు సోము వీర్రాజుకు ఆదివారం సాయంత్రం రాసిన లేఖలో పేర్కొన్నారు. జనసేన, మోడీ మధ్య సత్సంబంధాలు పెంపొందాలని, అవి మరింత పటిష్టం కావాలని మాత్రమే ఆకాంక్షిస్తున్నానని వెల్లడించాడు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment