Video Of Day

Breaking News

తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు కుదిరేనా?

is-possible-tdp-bjp-alliance

తెలంగాణలో టీడీపీతో జట్టు కట్టాలనే ఉద్దేశంతో ఉన్న కమల నాథుల మదిలో కొత్త ఆలోచనలు రేకెత్తుతున్నాయి. నిన్నటి వరకు పొత్తుల అంశం ఓ కొలిక్కి వచ్చినట్టే కనపడినా బీజేపీ నేతలు తమ అసంతృప్తిని రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ ముందు వెలిబుచ్చారు. పొత్తు కంటే ఒంటరి పోరే మేలని చాలా మంది నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఒక వైపు పొత్తు గురించి చర్చలు జరుపుతూనే మరో వైపు తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని టీడీపీ ప్రకటించడాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీని సంప్రదించరా? అంటూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. తెదేపాతో పొత్తు తప్పనిసరైతే.. కచ్చితంగా సగానికిపైగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్ని కేటాయిస్తేనే ఒప్పుకోవాలని అంటున్నారు. పొత్తులో భాగంగా సీఎం పదవి పార్టీకే దక్కాలని.. ఆ అభ్యర్థిత్వాన్ని భాజపాయే ప్రకటించాలన్న వాదనను తెరపైకి తెస్తున్నారు.  

No comments