తూర్పు గోదావరి నుంచి జగన్ పోటీ!


వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారా!? ఈ ప్రశ్నకు అవుననే సమాధానాలు చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీని దెబ్బ తీయాలనే ఉద్దేశంతో జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి కాకుండా తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీ వర్గాలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల నుంచి ఎవరిని నిలబెట్టినా సునాయాసంగా గెలుస్తారని.. ఈసారి పార్టీకి కాస్త క్లిష్టంగా ఉన్నచోటు నుంచి పోటీ చేస్తే ఆయనతోపాటు మరికొంతమంది అభ్యర్థులను గెలిపించుకుని ఎక్కువ సీట్లు సాధించుకునే అవకాశం ఉంటుందని వైసీపీలోని కొందరు కీలక నేతలు జగన్‌కు సూచించినట్టు సమాచారం. వాస్తవానికి, పులివెందుల నుంచి ఈసారి తానే పోటీ చేస్తానని, తన తల్లి విజయలక్ష్మిని ఎన్నికలకు దూరంగా ఉంచుతామని జగన్ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తూర్పు నుంచి జగన్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటుందని.. దాంతో, టీడీపీ మెజారిటీని తగ్గించడంతోపాటు పార్టీ మరిన్ని సీట్లు సాధించుకునే అవకాశం ఉంటుందని జగన్‌కు వారు నచ్చజెప్పినట్లు సమాచారం. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment