Video Of Day

Breaking News

నాకు నచ్చిన నాయకుడు జగ్గారెడ్డి - పవన్ కల్యాణ్

పార్టీ ప్రారంభోత్సవం సందర్బంగా పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చిన నాయకుడు జగ్గారెడ్డి అని తెలిపారు. జగ్గారెడ్డి లాంటి నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని చేపట్టి ఉంటే రెండు రాష్ట్రాల ప్రజలు స్వీట్లు పంచుకుని ఆనందంతో విడిపోయేవారన్నారు. జగ్గారెడ్డి ప్రస్తుతం మెదక్ జిల్లా సంగారెడ్డి ఎంఎల్ఏగా ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు కూడా అందరూ కలిసి ఉండాలనేది తన అభిమతమని తెలిపిన వ్యక్తి జగ్గారెడ్డి. ముక్కుసూటిగా మాట్లాడతారని ఈయనకు పేరుంది. టీఆర్ఎస్ పై ఒంటికాలితో లేచే వ్యక్తుల్లో జగ్గారెడ్డి ముందుంటారు.

No comments