Video Of Day

Breaking News

జనసేనా.. ఇంకా... ఉంది!

పార్టీని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. తన పార్టీకి అభ్యర్థులు లేరని, వెతుకులాటలో ఉన్నానని చెప్పారు. తన పార్టీలో గోడ మీద పిల్లిలా పార్టీలు మారే జంపర్స్, జోకర్స్ కు స్థానం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మినహాయించి ఎవరితోనైనా కలవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో అందరినీ కలిసి మాట్లాడతానని తెలిపారు. అయితే ఎవరిని కలుస్తారు? ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? ఎన్నికల్లో పోటీ చేస్తారా?లేదా అనే దానిపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు పవన్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

No comments