జశ్వంత్‌సింగ్ ఆశలపై నీళ్లు

Jashwanth_singh

లోక్‌సభ ఎన్నికల్లో సొంత రాష్ట్రమైన రాజస్థాన్‌లోని బార్మర్ నుంచి పోటీచేయాలని భావించిన బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌సింగ్ ఆశలపై బీజేపీ అధిష్టానం నీళ్లుచల్లింది. ఆయనకు అక్కడి నుంచి పార్టీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కల్నల్ సోనారామ్ చౌధరిని బార్మర్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీచేసేలా బలవంతంగా ఒప్పించిన అధిష్టానం ఆయనకు సన్నిహితుడిగా ముద్రపడిన జశ్వంత్‌కు ఆ మర్నాడే టికెట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో జశ్వంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏ హయాంలో మంత్రిగా పనిచేసిన జశ్వంత్ తన పాకిస్థాన్ సందర్శనపై రాసిన పుస్తకంలో ఆ దేశ పితామహుడు మొహమ్మద్ అలీ జిన్నాను పొగిడారు. అదే ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది. గుజరాత్‌లో అయితే ఈ పుస్తకాన్ని నిషేధించారు. ఈ వివాదం కారణంగా కొంతకాలంపాటు ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment