కేసీఆర్ కు సీమాంధ్రలో క్రేజ్!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణలోనైనా రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజుకోరకంగా చుక్కలు చూపిస్తున్నాడు. టీఆర్ఎస్ను విలీనం చేసుకుని తెలంగాణలో ఓట్లు, సీట్లను గంపగుత్తగా పొందాలనుకున్న కాంగ్రెస్ పార్టీపైనే ఆయన కాలు దువ్వుతున్నాడు. విలీనం సంగతి అటుంచి కాంగ్రెస్‌తో పొత్తు కూడా లేదని తేల్చి చెప్తూ కాంగ్రెస్‌తో కయ్యానికి సిద్ధమవుతున్నాడు. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌పై కేసీఆర్ ఎదురుదాడి ఎవరికి ఎలా కనిపిస్తున్నా సీమాంధ్రలో మాత్రం ఆయన క్రేజ్ ను పెంచుతోంది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీమాంధ్ర ప్రజలు, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ చుక్కలు చూపించడాన్ని సంతోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బాగా తిక్క కుదిరిందని మురిసిపోతున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment