గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేయనున్నారు. లోక్‌సభకు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. సీపీఐతో పొత్తు చర్చలు జరుగుతున్నందున రెండు, మూడు రోజుల్లో అది కూడా తేలిపోయే అవకాశం ఉంది. వచ్చే నెల 11 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రభావవంతంగా చేపట్టనున్నారు. జయ నామ సంవత్సరం మొదలయ్యాకే (మార్చి 31న ఉగాది) టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment