ఒక "బక్కోడి' పగటి కలలు


కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లు తెలంగాణ "బక్కోడు' కేసీఆర్ పగటి కలలు కంటున్నాడు! తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో తానే మొదటి ముఖ్యమంత్రిని కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు! ఇంతకుముందు వరకు తెలంగాణ కు మొదటి ముఖ్యమంత్రిని దళితుడిని, ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని బీరాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు అంతా తానై చక్రం తిప్పాలనుకుంటున్నాడు! కూతురు కవితను నిజామాబాద్ నుంచి ఎంపీ స్థానానికి పోటీకి దించుతున్నాడు! ఇప్పటికే మేనల్లుడు హరీశ్ రావు, కుమారుడు కేటీఆర్ శానససభ్యులుగా, తాను ఎంపీగా ఉంటూ  వారసత్వ రాజకీయాలకు తెరతీశాడు. అంతా వాళ్లే అయితే మాకు దిక్కెవరు అంటూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర నాయకులు లబోదిబోమంటున్నారు. పార్టీని విలీనం చేయనని కాంగ్రెస్ కు జెల్లకొట్టిన కేసీఆర్.. ఇప్పడు వీరిని కూడా కూరలో కరివేపాకులా తీసిపారేశారని విద్యార్థులు, ఉద్యోగులు బాధపడుతున్నారంట! ఇప్పటికే చాలామంది తెరవెనుక కాంగ్రెస్ తో, బీజేపీ తో మంతనాలు జరుపుతున్నారని వినికిడి. ఉస్మానియా విద్యార్థులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో కేసీఆర్ జుట్టు పీక్కుంటున్నాడంట! వీరితో తెలంగాణ సానుభూతి ఓటు చీలిపోతుందనే భయంలో ఉన్నాడంట! అందుకే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ ను మహబూబ్ నగర్ నుంచి పోటీకి దించుతున్నాడు. ఇదిలా ఉంటే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్న కేసీఆర్ ఆశలు నెరవేరేలా లేవు. ఎందుకంటే తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 60 కు పైగా స్థానాలు సాధిస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం. అయితే తెరాస కేవలం వరంగల్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే బలంగా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండలలో మనోడికి సింగిల్ సీటు కూడా రాదని బెట్టింగ్ వీరులు పందేలు కడుతున్నారు. బలంగా ఉన్న జిల్లాల్లో కూడా వేరే పార్టీతో పొత్తు ఉంటేనే ఇది సాధ్యమని అంచనా! సో.. బక్కోడి కలలు కల్లలే..!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment