గులాబీ నేతలకు తలనొప్పిగా మారిన టికెట్ల వ్యవహారం

కేసీఆర్ హామీలే మెడుకు చుట్టుకుంటున్న వైనం!
విభజన వాదంతో తెలంగాణ హీరో అయిన కేసీఆర్
జంపింగ్ జపాంగ్ లతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన
ఉద్యమాన్ని భుజాల కెత్తుకుంటే మాకు జరిగిన న్యాయమేది
కొత్త అతిథులతో పార్టీ సీనియర్ నేతల్లో గుబులు
హైదరాబాద్ : గత దశాబ్ధకాలంగా గులాబి నేత కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ వాదాన్ని వినిపించిన మాకు తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకునేందుకు వీలుగా తమకు ఎన్నికల్లో సీటు కేటాయించాలని పలువురు సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభీష్టం. అయితే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్విప్ చేస్తుందనుకున్న వివిధ పార్టీల ఆశావాహులు సంవత్సరాల తరబడి నాయకులుగా ఎదిగినా.. లబ్దిపొందిన పార్టీలను సైతం వదులుకొని కొత్తగా వచ్చిన టీఆర్ ఎస్ చెంతకు చేరుతున్నారు. ఇక్కడే వచ్చింది చిక్కంతా ఇన్ని రోజులు తెలంగాణ రాష్ర్టంకోసం పార్టీ జెండాను భుజాన వేసుకొని, తమ నాయకుడు కేసీఆర్ నాయకత్వాన్ని దేశానికి చాటిచెప్పిన కార్యకర్తలు, నాయకులకు అన్యాయం చేయవద్దంటూ ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు అదినేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు ఇదివరకు ఉన్న పార్టీలో దిక్కుముఖం లేకనే తెలంగాణ వాదం చెప్పుకొని టీఆర్ఎస్ లో చేరితే పరువైనా దక్కుతుందని వస్తున్నారే తప్పా! నిజమైన తెలంగాణ వాదాన్ని ముందుండి నడిపించిన గులాబి శ్రేణులను విస్మరించరాదని పలువురు మేధావులు సలహాలిస్తున్నారు.
తెలంగాణ వస్తే ఎస్సీని సీఎం చేస్తా :
తెలంగాణ ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీలను పలువురు మేధావులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విమర్శలకు దిగుతున్నారు. అంతేగాక ఏకంగా టీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పడం కూడా కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. ఇంకో అడుగు ముందుకు వేసిన కేసీఆర్ అమరవీరులను ఆదుకుంటామని చెప్పడం. వారికి రాజ్యంగా పరంగా చట్టసభల్లో సీట్లు కూడా కేటాయిస్తామని చెప్పారో లేదో తెలియదు కాని వారు అందరూ టీఆర్ ఎస్ టికెట్ తమకు కేటాయించాల్సిందేనంటూ అమరవీరుడు శ్రీకాంత్ చారి తల్లి బీష్మించు కూర్చుంది. దీంతో కేసీ ఆర్ కు ఏమీ చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ముందు నుంచి ఉద్యమంలో పాలుపంచున్న నాయకులకు టికెట్ ఇవ్వకపోతే వాదానికే అర్థం ఉండదు. గులాబి నేత అండ చూసుకొని జాతీయ పార్టీలను సైతం వదలుకొని తమ వద్దకు వచ్చిన వారిని ఆదుకోకపోతే బాగుండదు. ఇదిలా ఉండగా తెలంగాణ కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన అమరవీరుల కుటుంబాలకు టికెట్ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలను ఇబ్బందిపెట్టినట్లే అవుతుంది. మరి ఈ టికెట్ ల వ్యవహారం ఎలా సమర్ధవంతంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment