కిట్టీ పార్టీ... జై సమైక్యాంధ్ర

kiran Jai samaikyandra party

పాత సినిమాకు బ్లాక్ టికెట్లమ్మినట్లు... రాష్ట్ర విభజన ఖరారై, ఆ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ సమైక్య రాగం పాడుతున్నాడు మన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్రం ఇంకా విడిపోలేదని.. సుప్రీం కోర్టుపై తమకింకా ఆశ ఉందని ఆయన పేర్కొంటున్నారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయినా తూర్పు, పశ్చిమ జర్మనీలు కలసిపోయినట్లుగా తిరిగి కలుపుతామంటున్నారు. తాను ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని.. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కిరణ్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని తన ప్రైవేటు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీ పేరుతో పాటు 16 మందితో పార్టీ కార్యవర్గాన్నీ ప్రకటించారు. కానీ సమైక్యాంధ్ర పార్టీలో ఒక్క తెలంగాణ నేతనూ చేర్చుకోకపోవడం గమనార్హం. ఈ నెల 12న జరగనున్న రాజమండ్రి సభలో పార్టీ గుర్తు తదితర అంశాలను ప్రకటించనున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి - పార్టీ అధ్యక్షుడు
వ్యవస్థాపక అధ్యక్షుడు - చుండ్రు శ్రీహరిరావు
ఉపాధ్యక్షులు- ఎ.సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బంహరి, జి.వి.హర్షకుమార్, సాకే శైలజానాథ్, పితాని సత్యనారాయణ,
ప్రధాన కార్యదర్శులు - ఎన్.తులసిరెడ్డి, కేశిరాజు శ్రీనివాస్ (గజల్ శ్రీనివాస్), టి.దొరస్వామి, ఎం.వి.రత్నబిందు, జి.గంగాధర్,
కోశాధికారి- భమిడిపాటి రామమూర్తి,
సభ్యులు- మహ్మద్ అబ్దుల్‌ఖాదిర్, బండి సుధాకర్
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment